స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ మొదటి వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, సిబ్బందితో కలిసి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
తెదేపాలో చేరిన నాటి నుంచి ఆయన చేసిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటులో కోడెల పాత్ర గొప్పదన్న ఆయన...అలాంటి మహానీయుని ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి : కేటీఆర్