ఓ ఏజెన్సీకి అనుమతి ఇచ్చేందుకు బలరామ్ ప్రసాద్ అనే వ్యక్తిని రూ. 10 వేలు డిమాండ్ చేసిన మౌలాలి ఏఎల్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ కార్మిక శాఖ కార్యాలయంలో జరిగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరికి చెందిన బలరామ్ ప్రసాద్ మ్యాన్ పవర్ ఏజెన్సీ కోసం ఈ నెల 4న జవహర్‌నగర్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
దరఖాస్తు పరిశీలించిన మౌలాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీయుద్దీన్ పదివేల రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు రూ. 4 వేలను ఇచ్చినప్పటికీ... దరఖాస్తును పెండింగ్‌లో పెట్టడం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులు, కార్మిక శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అబ్దుల్ షఫీయుద్దీన్ను అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత