ఓటుకు నోటు కేసులో అనిశా ప్రత్యేక న్యాయస్థానం టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మాజీ గన్మెన్ల వాంగ్మూలాలను నమోదు చేసింది. కేసు నమోదైన సమయంలో రేవంత్ రెడ్డికి గన్మెన్లుగా ఉన్న డి.రాజ్ కుమార్, ఎస్.వెంకట కుమార్ సాక్షులుగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలిశారు...ఎక్కడెక్కడికి వెళ్లారో వారు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.
ఉదయ సింహా మాత్రమే హాజరు
ఈరోజు జరిగిన అనిశా ప్రత్యేక కోర్టు విచారణకు నిందితుల్లో ఒకరైన ఉదయ సింహా మాత్రమే హాజరయ్యారు. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఎల్లుండి సాక్షులుగా విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి సోదరుడు ఎ.కృష్ణారెడ్డి, సెబాస్టియన్ కుమారుడు అభిశాయి సెబాస్టియన్కు, సెల్వనందన్ ఆంటోనికి కోర్టు సమన్లు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి, సండ్ర గైర్హాజరు
ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం జరిగిన ఓటుకు నోటు కేసు విచారణకు ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరు కాగా.. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. స్టీఫెన్‌సన్ గన్‌మెన్లు నీరజ్‌రావు, రఘునందన్ సాక్షి వాంగ్మూలాలు ఏసీబీ కోర్టు నమోదు చేసింది. జులై 13 వరకు 18 మంది సాక్షుల విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేసేందుకు న్యాయస్థానం ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది.
సంబంధిత కథనాలు చూడండి..
Vote For Note Case: జులై 7 నుంచి సాక్ష్యుల విచారణ కొనసాగించాలని నిర్ణయం
Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు