లాక్డౌన్లో భాగంగా హైదరాబాద్ ఏంజె మార్కెట్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అబిడ్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత కూడా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా శ్రేయస్సు కొరకే లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామని.. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని ఏసీపీ వెంకట్ రెడ్డి కోరారు. అదేవిధంగా తీసుకున్న పాసులను దుర్వినియోగం చేయొద్దని వాహనాదారులకు సూచించారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు