రాష్ట్రంలో ఆసరా పథకం కింద బడుగు వర్గాలకు పింఛన్లను అందజేసేందుకు ఆర్థిక శాఖ రూ.4,425.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్ల కోసం నిధులు మంజూరు చేసింది. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, బోధకాలు వ్యాధిగ్రస్థులు, బీడీకార్మికులు, ఒంటరిమహిళలకు నెలవారీగా పింఛన్ అందజేయనున్నారు.
ఇవీ చూడండి:"యూరియా అక్రమాలను సహించేది లేదు"