భాజపా జాతీయ నేత మురళీధర్‌రావు తనను మోసం చేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ వేగంగా జరగడం లేదని ప్రవర్ణారెడ్డి అనే మహిళ మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మార్చిలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరగడం లేదని ఆరోపించారు. నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని మురళీధర్‌రావు, మరికొందరు కలిసి రూ. 3 కోట్లు తీసుకుని మోసం చేశారని ప్రవర్ణారెడ్డి తెలిపారు. దీనిపై 4 వారాల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : 'బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నాం'