ETV Bharat / state

పింఛన్ సొమ్ము కోసం కన్నతండ్రినే చంపేశాడు - son

మానవత్వం మంట కలిసిన క్షణమిది! పింఛన్ కోసం ఓ కసాయి కొడుకు లిఖించిన రక్త చరిత్ర ఇది! కేవలం రూ. 2,250 రూపాయల కోసం కన్న తండ్రినే కొట్టి చంపిన విషాదమిది!?

పింఛన్ కోసం కన్నతండ్రినే చంపేశాడు
author img

By

Published : Jul 12, 2019, 2:52 PM IST

పింఛన్ డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రినే దారుణంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా చందర్లపాడులో ఈనెల 8న దారుణం జరిగింది. గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌సాహెబ్‌ (75) రోజువారీ కూలి. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. ఈనెల 8వ తేదీన 2,250 రూపాయల వృద్ధాప్య పింఛన్‌ తీసుకుని ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి అతని రెండో కొడుకు సిలార్‌సాహెబ్‌ ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తండ్రిని డబ్బు అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో దాడికి దిగాడు. గొంతు నులిమి చంపేదుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన మహబూబ్​ సాహెబ్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి నందిగామ ఆస్పత్రిలో అతను మరణించాడు.

పింఛన్ కోసం కన్నతండ్రినే చంపేశాడు

ఇదీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు

Intro:JK_AP_NLR_02_12_UCHITHA_PANTALA_BEEMA_RAJA_PKG_C3_AP10134 anc కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకం ద్వారా రైతులు ఇన్సూరెన్స్ కట్టేవారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులు చెల్లించనక్కర్లేదు. ఈ పథకంపై ప్రభుత్వం విస్తృతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ పరిస్థితులపై జై కిసాన్ ఈటీవీ కథనం. వాయిస్ ఓవర్,1 రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శివ నారాయణ తెలిపారు. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతుల కట్టుకునేవారు ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని జేడీఏ తెలిపారు. ఈ పంటల భీమా వరి ,చెరకు, మిరప ,మొక్కజొన్న, పెసర ,పంటలకు వర్తిస్తుందన్నారు. వర్షాలు లేక కరువు వచ్చినప్పుడు, తీవ్ర వర్షాభావం తో తో పంటలు దెబ్బ తిన్నప్పుడు ఇన్సూరెన్స్ వస్తుందని , దీంతో రైతులు చాలా వరకు మేలు జరుగుతుందన్నారు. ఇన్సూరెన్స్ పథకం పై ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రచారం నిర్వహిస్తామని జె డి ఏ తెలిపారు. రైతులు ఆయా మండలాల వ్యవసాయ అధికారులు కలిసి పూర్తి సమాచారం తెలుసుకొని ఇన్సూరెన్స్ కట్టుకోవాలని తెలిపారు. బైట్, శివ నారాయణ జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 ప్రభుత్వం రైతులకు ఉచితం పంటల బీమా పథకం ప్రవేశ పెట్టడం మంచిదేనని రైతు నాయకులు అంటున్నారు. అయితే ఇన్సూరెన్స్ పథకం పై రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని రైతు నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కౌలు రైతులు కూడా వర్తింప చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బైట్స్, 1.వెంకట రమణయ్య నాయుడు, రైతు సంఘం నాయకులు 2. కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి

Body:ఉచిత ఇన్సూరెన్స్

Conclusion:రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.