ETV Bharat / state

కేసీఆర్​ సార్​.! మా సమస్యలు వినండి.. ప్రగతి భవన్​ ఎదుట యువతి హల్​చల్​

author img

By

Published : Jun 27, 2021, 3:38 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంపై యువత అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలపై ప్రగతి భవన్​ ఎదుట ఓ యువతి నిరసన తెలిపింది. సీఎం కేసీఆర్ తమ సమస్యలు వినాలంటూ వేడుకుంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

girl protest at pragathi bhavan
ప్రగతి భవన్​ ఎదుట యువతి హల్​చల్​

ప్రగతిభవన్ ఎదుట రాజ్యలక్ష్మి అనే యువతి హల్‌చల్ చేసింది. సీఎం కేసీఆర్ తమ సమస్యలు వినాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా పేదలకు న్యాయం జరగాలంటూ, తమ సమస్యలు కేసీఆర్ వినాలని నిరసన తెలిపింది. లాక్​డౌన్​తో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగాలు, డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులు, ప్రజలను మోసం చేసిందని ఆరోపించింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకుంటుండగా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాధలను మీడియాకు చెప్పుకుంటానని.. తనకు అవకాశమివ్వాలని కోరింది.

పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తుండగా.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రగతి భవన్​ ఎదుట యువతి హల్​చల్​

ఇదీ చదవండి: కాంగ్రెస్​ కార్యకర్తలంతా సిపాయిల్లా పనిచేయాలి: షబ్బీర్​ అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.