ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగర శివారు రామవరప్పాడు గ్రామంలో సుంకర రమేష్ బాబు అనే రైతు నల్ల బియ్యం సాగుకు ఉపక్రమించారు. అందరి రైతుల్లా కాకుండా వినూత్నంగా ఆలోచించిన రైతు రమేష్.... కార్ బీపీటీ 2841 రకానికి చెందిన నల్ల ధాన్యం సాగు చేపట్టారు. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తీసుకొచ్చిన ఈ నల్ల ధాన్యం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేయగా... ఆశించిన రీతిలో దిగుబడి వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ బీపీటీ 2841 రకం ధాన్యంలో పోషక విలువలు ఆధికంగా ఉంటాయన్నారు. జింక్, ప్రోటీన్స్... ఇతర రకాల బియ్యం కంటే ఎక్కువగా ఉండటం వల్ల... దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతు రమేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితులలో రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి పోషక విలువలు కలిగిన ఈ నల్ల ధాన్యం చక్కగా ఉపయోగపడతాయని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నల్ల ధాన్యం విత్తనాలు సరఫరా చేస్తే మరి కొంతమంది రైతులు సాగు చేయడానికి ముందుకొస్తారని రైతు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇళ్ల పన్ను రాయితీపై ఉత్తర్వులు జారీ