ETV Bharat / state

టీఎస్‌ బీ-పాస్: 3 వారాలు.. 900కి పైగా అనుమతులు

టీఎస్‌ బీ-పాస్‌ విధానంలో ఇప్పటివరకూ అన్నీ తక్షణ అనుమతులే మంజూరు చేశారు. వీటిలో 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలకు కేవలం పదిలోపే దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. పరిశీలన కమిటీలు ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ కోరనుంది.

900 permissions in three weeks through TS BPAS IN telangana
3 వారాలు.. 900కి పైగా అనుమతులు
author img

By

Published : Dec 12, 2020, 8:22 AM IST

రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు తీసుకువచ్చిన టీఎస్‌-బీపాస్‌ విధానంలో ఇప్పటివరకూ సుమారు 900కి పైగా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. మూడు వారాల నుంచి టీఎస్‌-బీపాస్‌ కింద భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలకు కేవలం పదిలోపే దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మిగిలినవి అన్నీ 75, 600 చదరపు గజాల్లోపు ఉన్నవే. 75 చదరపు గజాల్లోపు ఉన్నవాటికి నమోదుతోనే నిర్మాణ అనుమతి మంజూరవుతుండగా, 75 నుంచి 600 చదరపు గజాల్లోపు వాటికి నిర్దేశించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ఫీజులు చెల్లించిన వెంటనే అనుమతులు మంజూరవుతున్నాయి.

బీపాస్‌ ఆన్‌లైన్‌ అనుమతులకు అందజేస్తున్న వివరాలను, లింక్‌ డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతుల కోసం స్థలాలను తక్కువ విస్తీర్ణంతో విడగొట్టి దరఖాస్తు చేస్తున్నవి ఉంటున్నాయా? అనేది పక్కాగా పరిశీలిస్తున్నారు. నిర్మాణ, జోనింగ్‌ నిబంధనలు, మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం భూవినియోగ నిబంధనలు, ప్రభుత్వ భూములు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పురపాలక అధికారి తెలిపారు.

పోస్టు వెరిఫికేషన్‌ బృందాలు, కమిటీలు ఏర్పాటు చేయాలి
అనుమతి ఇచ్చిన తర్వాత జిల్లాల్లో కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించాల్సి ఉంది. ఇందుకోసం పోస్టు వెరిఫికేషన్‌ బృందాలను ఏర్పాటుచేయాలని పురపాలకశాఖ కలెక్టర్లను కోరనుంది. ఈ బృందాలను త్వరగా ఏర్పాటు చేస్తేనే క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారు తప్పుడు సమాచారం ఇచ్చి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేసేందుకు బీ-పాస్‌ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టం మేరకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నేతృత్వంలో కమిటీ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలు ఉంటాయి. వివిధ శాఖల అధికారులు ఉండే ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఇదీ చదవండి: 'విపణి శక్తులకు రైతును ఎరగా వేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.