ETV Bharat / state

Independence day: సీఆర్​ ఫౌండేషన్​లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్​లోని సీఆర్​ ఫౌండేషన్​లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఆర్​ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర్య సమరయోధులను ఫౌండేషన్ నిర్వాహకులు సత్కరించారు.

CR FOUNDATION
సీఆర్​ ఫౌండేషన్​
author img

By

Published : Aug 15, 2021, 3:33 PM IST

హైదరాబాద్​ కొండాపూర్​లోని సీఆర్​ ఫౌండేషన్​లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్​ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు ఉదయం 10గంటలకు త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆశ్రమంలో నివాసం ఉంటున్న స్వాతంత్య్ర సమరయోధులు టీ. రామారావు, శాఖమూరి సుగుణ, రామిరెడ్డిలను ఆయన సన్మానించారు. కరోనా మహమ్మారి సమయంలో సమాజంలోని నిస్సహాయులకు విశేష సేవలందించిన డాక్టర్​. కూనంనేని రజనీని వృద్ధాశ్రమ నివాసితులు సన్మానించారు.

cr foundation
స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం

డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్, ప్రముఖులు​ రూపొందించిన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సీఆర్​ ఫౌండేషన్​ కార్యదర్శి పీజే చంద్రశేఖర్​ రావు అన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులను, వారి త్యాగాలను సుగుణ గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: INDEPENDENCE DAY CELEBRATIONS: పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.