స్వీయ భధ్రతను ద్విచక్ర వాహనదారులు విస్మరిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో తలకు చిన్నపాటి గాయమైనా ప్రాణాలు పోయే అవకాశమున్నా.. శిరసాస్త్రం మాత్రం ధరించడం లేదు. హెల్మెట్ లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు.
దాదాపు 77శాతం వరకు ఇలాంటి కేసులే నమోదవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఈ పరిస్థితి అద్దం పడుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ప్రాణాంతకంగా మారిన వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ తరహా 12 ఉల్లంఘనల్లో గత ఏడాది సుమారు కోటికి చేరువచ్చాయి. వీటిలో హెల్మెట్ ధరించని కేసులే 70శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసులు 72వేల వరకు నమోదయ్యాయి.
ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోనే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు 2,493 జరగ్గా.. అందులో 951 మంది ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. సుమారు 1200 వందల మంది మృతులు, క్షతగాత్రులుగా మారారు.
గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబుల వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకునేవి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా జరగడం వల్ల మందుబాబులు దారికొస్తున్నారు. గత ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒక్కశాతం మాత్రమే నమోదయ్యాయి.
గత సంవత్సరం నమోదైన కేసులివే...
- శిరసాస్త్రం లేకుండా ప్రయాణం - 72,74,713
- అతివేగం - 8,25,599
- రాంగ్ రూట్ - 5,40,022
- ట్రిపుల్ డ్రైవింగ్ - 3,06,775
- ఓవర్ లోడ్ - 2,85204
- తప్పుడు నంబర్ ప్లేట్లు - 2,70,895
- డ్రంక్ అండ్ డ్రైవ్ - 99,620
- సీటు బెల్టు లేని ప్రయాణం - 84,279
- సెల్ ఫోన్ డ్రైవింగ్ - 83,003
- సిగ్నల్ జంపింగ్ - 78,438
- మైనర్ డ్రైవింగ్ - 10,336
ఇదీ చూడండి : ఎన్ఆర్ఐతో పెళ్లి విషయంలో మహిళలూ... జర భద్రం !!