ETV Bharat / state

గ్రేటర్‌లో తగ్గుతూ.. శివార్లలో పెరుగుతూ!

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదుకాగా... ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్​లో 683 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గతంలో నగరంలో ఎక్కువ కేసులు నమోదు కాగా... జిల్లాల్లో అతి తక్కువగా ఉండేవి. ముఖ్యంగా నగరానికి నలువైపులా ఉన్న జిల్లాల్లో వైరస్‌ వ్యాపిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.

coronavirus
coronavirus
author img

By

Published : Jul 25, 2020, 7:16 AM IST

హైదరాబాద్‌ గ్రేటర్‌లో వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. శివారు ప్రాంతాల్లో క్రమేపీ పెరుగుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో రోజు రోజుకు వైరస్‌ విస్తరిస్తోంది.

నగరానికి వచ్చిపోతుండడం.. జాగ్రత్తలపరంగా నిర్లక్ష్యం వహిస్తుండడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాపిస్తోంది. తాజాగా శుక్రవారం 683 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో 135 మందికి, మేడ్చల్‌లో 30 మందికి కరోనా నిర్ధారించారు.

లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి

మల్కాజిగిరిలో ఓ వృద్ధుడికి అనారోగ్యం తలెత్తడంతో బంధువులు 108 అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. వాహనంలో ఎక్కిస్తుండగానే ప్రాణాలు వదలడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. పరీక్ష చేయకపోవడంతో కరోనా ఉందో..లేదో నిర్ధారణ కాలేదు. అంబర్‌పేట పరిధిలో శుక్రవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మరణించారు.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి కన్పిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జాప్యం చేస్తే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంబర్‌పేట పరిధిలోని పలు ప్రాంతాల్లో 60 మంది కరోనా సోకింది. ఫీవర్‌ ఆసుపత్రిలో శుక్రవారం ఒక్కరోజే 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

చుట్టుపక్కల జిల్లాల్లో విస్తృతం

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,640 మందికి కరోనా నిర్ధారణ కాగా... ఇందులో 957 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ బయటి వారే. గతంలో నగరంలో ఎక్కువ శాతం కేసులు నమోదు కాగా... జిల్లాల్లో అతి తక్కువగా ఉండేవి. ముఖ్యంగా నగరానికి నలువైపులా ఉన్న జిల్లాల్లో వైరస్‌ వ్యాపిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.

గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే శివారు మున్సిపల్‌ సర్కిళ్లయిన మల్కాజిగిరి, ఉప్పల్‌, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, రాజేంద్రనగర్‌, కాప్రా, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతం నుంచి నిత్యం 30-40 కేసులు బయట పడుతున్నాయి. ప్రతి ఒక్కరు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.