ETV Bharat / state

రాజధానిపై విరుచుకుపడుతున్న కరోనా - హైదరాబాద్​లో కరోనా వైరస్ వార్తలు

రాష్ట్ర రాజధానిపై కరోనా విరుచుకుపడుతోంది. ఆదివారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో 659 మంది వైరస్​ బారిన పడ్డారు. గ్రేటర్​ హైదరాబాద్​లో ప్రైవేటుతోపాటు, ఏరియా ఆస్ప‌త్రుల్లో పరీక్షలు చేయ‌డం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు.

659-new-corona-cases-has-reported-in-hyderabad-on-sunday
రాజధానిపై విరుచుకుపడుతున్న కరోనా
author img

By

Published : Jun 22, 2020, 2:33 AM IST

Updated : Jun 22, 2020, 6:57 AM IST

హైద‌రాబాద్​లో క‌రోనా కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆదివారం కూడా నగ‌రంలో భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 659 మంది వైరస్​ బారిన పడ్డారు. కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిల్లలో మొత్తం 9 కేసులు వచ్చాయని అధికారులు వెల్ల‌డించారు. బోరబండలో 5, మూసాపేట్​లో 3, కేపీహెచ్​బీ కాలనీలో ఒకరికి వైరస్​ సోకింది. వీరంద‌రిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హ‌నుమంత రావుకు క‌రోనా నిర్ధర‌ణయింది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. న‌గ‌రంలోని పాతబ‌స్తీ ట‌పాఛ‌బుత్ర ‌పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వ‌హిస్తున్న సీఐతోపాటు.. ఎనిమిది మంది పోలీసులకు వైరస్​ సోకింది. వీరిలో అత్యధికులు వాహన తనిఖీల విధుల్లో పాల్గొన్న‌ట్లు తెలిసింది.

రామంతపూర్​లోని హోమియోపతి ఆస్పత్రిలో ఒక న‌ర్సుకు క‌రోనా నిర్ధర‌ణయింది. అంబ‌ర్​పేట్ నియోజిక‌బ‌వ‌ర్గంలో 48 కేసులు న‌మోద‌య్యాయి. న్యూ ప్రేమ్​న‌గ‌ర్​లో 10, ప‌టేల్​న‌గ‌ర్​లో 10, తుర‌బ్​న‌గ‌ర్​లో 8, అంబ‌ర్​పేట్ ఏరియాలో 8 మందికి వైరస్​ బారిన పడ్డారు.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

Last Updated : Jun 22, 2020, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.