రాష్ట్రంలో గురువారం కొత్తగా 648 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు వైరస్ బాధితుల సంఖ్య 6,39,368కి చేరింది. మరో 696 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 6,25,738 మంది సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా మరో ముగ్గురు వైరస్‌కు బలికాగా.. మరణాల సంఖ్య 3,774కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా వచ్చిన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 82, ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 26, జగిత్యాల 20, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులాంబ గద్వాల్ 7, కామారెడ్డి 1, కరీంనగర్ 59, ఖమ్మం 46, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 12, మంచిర్యాల 28, మెదక్ 4, మేడ్చల్-మల్కాజిగిరి 35, ములుగు 8, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 35, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 10, పెద్దపల్లి 28, రాజన్న సిరిసిల్ల 18, రంగారెడ్డి 25, సంగారెడ్డి 11, సిద్దిపేట 13, సూర్యాపేట 44, వికారాబాద్ 4, వనపర్తి 14, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చూడండి: CROP LOSS: రైతన్నను నిండా ముంచిన భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న పొలాలు