ETV Bharat / state

సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయాలు - సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త

సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించే పెన్షన్‌ నిధికి... చేయూత నివ్వాలని ఆ సంస్ధ యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో జరిగిన 556వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు.

కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయాలు

author img

By

Published : Jan 28, 2021, 4:20 PM IST

సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే ప్రతి టన్ను బొగ్గుకు 10 రూపాయల చొప్పున కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ స్కీం (సి.ఎం.పి.ఎస్‌.) నిధికి చెల్లించడానికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదించారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో జరిగిన బోర్డ్​ఆఫ్​ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్​ వెల్లడించారు. పదవీ విరమణ పొందిన కార్మికుల సంఖ్య పెరగడం వల్ల పింఛన్​ చెల్లింపులకు నిధుల కొరత ఏర్పడిందని... దానిని భర్తీ చేయడానికి సమావేశంలో అంగీకరించినట్లు తెలిపారు. 2020 డిసెంబర్‌ 19 నుంచి దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వాటితో పాటు వివిధ ఓసీ గనులకు అవసరమై ఉన్న 12 మోటార్‌ గ్రెడర్లు కొనుగోలుకు... భూగర్భ గనుల్లో అవసరమైన 21 ఎస్​డీఎల్​ యంత్రాలు కొనేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సింగరేణిలోని నాలుగు ఓసీ గనుల్లో మొబైల్‌ క్రషర్లను నిర్వహించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జీవో 59 ప్రకారం పలురకాల చిన్న తరహా పనులను ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తున్న పద్ధతిని సింగరేణిలో కూడా అమలు జరపడానికి బోర్డు ప్రాథమికంగా అంగీకరించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ జీవోను అనుసరించి రూపొందించనున్నారు.

ఇదీ చూడండి: 'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.