ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో ఒక్కరోజులోనే 44 పాజిటివ్​ కేసులు - coronavirus death toll in ap

ఏపీ​లో కరోనా పాజిటివ్​ కేసులు 647కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 26 కొత్త కేసులు పాజిటివ్​గా తేలాయి.

44 new covid cases in andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో 647కు చేరిన కరోనా కేసులు
author img

By

Published : Apr 19, 2020, 12:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్థరణ అయినట్లు హెల్త్​ బులెటిన్​లో ప్రకటించింది.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో 565 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కర్నూలు జిల్లాలో కొవిడ్​తో ఒకరు మరణించారని... రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 23 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

44 new covid cases in andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో 647కు చేరిన కరోనా కేసులు

ఇదీ చదవండి: నిరాశపరిచిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.