ETV Bharat / state

ఇంటర్‌లో 40 శాతం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు

author img

By

Published : Jul 16, 2020, 7:14 AM IST

ఇంటర్‌మీడియట్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు ఇంటర్‌బోర్డు సన్నద్ధమైంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, మార్కుల కేటాయింపు తదితర అంశాల్లో పలు సంస్కరణలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆమోదం లభిస్తే కొత్త విద్యా సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని భావిస్తోంది.

40% multiple choice questions in ts Inter exams
ఇంటర్‌లో 40 శాతం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు

ఇంటర్‌మీడియట్‌ పరీక్షల్లో కేవలం వ్యాసరూప ప్రశ్నలే కాకుండా 40 శాతం మార్కులకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. ఏడాదిలో ఇలాంటివి మూడు పరీక్షలు నిర్వహించి వాటిల్లో అధిక మార్కులు వచ్చిన రెండిటి సగటు తీసుకుని తుది మార్కులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం పలు ప్రవేశ పరీక్షలను టీసీఎస్‌ అయాన్‌ తదితర సంస్థలే జరుపుతున్నాయి.

ఈ పరీక్షల నిర్వహణను కూడా అలాంటి సంస్థలకు అప్పగించవచ్చని తెలిపారు. అలానే ఇంటర్నల్స్‌కు 20 శాతం మార్కులు ప్రతిపాదించారు. ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు వంటి వాటికి ఈ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. తుది పరీక్షలు 40 శాతం మార్కులకు ఉంటాయి.

లక్ష్యం బాగున్నా.. సమస్యలూ ఉన్నాయి..

  • ‘‘సంస్కరణల లక్ష్యం బట్టీ విధానానికి చరమగీతం పాడటమే. వార్షిక పరీక్షలే కాకుండా నిరంతర మూల్యాంకనం ఉంటే ఎప్పటికప్పుడు విద్యార్థులు తమ పరిస్థితిని అంచనా వేసుకుంటారు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉండే ఎంసీక్యూ పరీక్షలు రాయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకూ ఉపయోగంగా ఉంటుంది. సబ్జెక్టు పరిజ్ఞానం, అవగాహన, అప్లికేషన్‌ తరహాలో ఈ ప్రశ్నలు ఉంటాయి. దీంతో అన్ని అధ్యాయాలను విద్యార్థులు సంపూర్ణంగా చదువుతారు. లోతుగా అర్థం చేసుకున్న వారే కచ్చితమైన జవాబులు గుర్తించగలుగుతారు’’ అని అధికారులు విశ్లేషిస్తున్నారు.
  • ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ కొంత భారమే అయినా.. ‘‘చివరి పరీక్షలు 40 శాతం మార్కులకే కాబట్టి.. వాటి జవాబుపత్రాల పుటల సంఖ్య సగానికిపైగా తగ్గిపోతుంది. మూల్యాంకనం త్వరగా పూర్తవుతుంది. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి వెళితే అధ్యాపకుల రాకపోకలు తగ్గిపోతాయి. మొదట్లో కొంత భారమైనా క్రమేణా వ్యయం తగ్గుతుంది’’ అని వివరిస్తున్నారు.
  • ఇప్పటికే ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించి ప్రాక్టికల్‌ మార్కుల్లో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు అవకతవకలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరో 20 శాతం అంతర్గత పరీక్షల మార్కులు అంటే వారిది ఇష్టారాజ్యమైపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కాబ్సే మార్గదర్శకాల మేరకు

దశాబ్దాలుగా ఇంటర్‌ ప్రశ్నపత్రాలు, పరీక్షల్లో మార్పులు లేవు. ఫలితంగా నాలుగైదు సంవత్సరాల ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను చదువుకుంటే చాలు 70 శాతానికిపైగా మార్కులు తెచ్చుకోవచ్చని నిపుణుల నుంచి తరచూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమలు చేస్తూ.. ఇంటర్‌కు వచ్చేసరికి పాఠ్య పుస్తకాల్లోని ప్రశ్నలను అచ్చుగుద్దినట్లుగా పరీక్షల్లో ఇవ్వడం ఏంటన్న ప్రశ్నలు విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షల విధానంలో చేయాల్సిన మార్పులపై కౌన్సిల్‌ ఆఫ్‌ బోర్డ్స్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(కాబ్సే) ఇటీవల అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. వాటిని పరిశీలించిన ఇంటర్‌బోర్డు ఈ సంస్కరణలు ప్రతిపాదించింది. ఈ ఏడాది పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.