అర్ధరాత్రి ఆడది రోడ్డుపై తిరిగినపుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని జాతిపిత మహాత్మ గాంధీ చెప్పారు. అర్ధరాత్రి దేవుడెరుగు. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై అదీ రాష్ట్ర రాజధానిలో కూడా తిరలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్తున్న అనసూయ అనే మహిళ మెడలోంచి 4తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు. హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో ఈ చోరీ జరిగింది. ఈ చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సుధాకర్ సిద్దూ అయ్యాడు... భార్య చేతిలో తన్నులు తిన్నాడు