హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి చెందారు. మేడిపల్లి, చిలకలగూడ, ముషీరాబాద్, హయత్‌నగర్‌కు చెందిన బాధితులు అనారోగ్యంతో కింగ్‌కోఠిలోని ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
వీళ్లందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా... ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందారు. అలాగే అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఈ సర్కిల్లో 1371 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.