ETV Bharat / state

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి... తాజాగా 3,603 కేసులు

Corona
Corona
author img

By

Published : Jan 23, 2022, 8:11 PM IST

Updated : Jan 23, 2022, 8:36 PM IST

20:09 January 23

కరోనా బారిన పడి మరొకరు మృతి

Telangana New Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3,603 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరొకరు ప్రాణాలొదిలారు. వైరస్ నుంచి మరో 2,707 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 93,397 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,603 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్​ఎంసీలోనే 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలు అలసత్వం ప్రదర్శించవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడ, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రెండోసారి కరోనా

Last Updated : Jan 23, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.