హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన కిషన్ సింగ్నా పెంపుడు కుక్క పేరు రాటాక్ వీలర్. శునకాన్ని 8 ఏళ్లగా తమ సొంత బిడ్డలాగే పెంచారు కిషన్ సింగ్నా. గత ఆరు నెలలుగా రాటాక్ కడుపు నొప్పితో బాధపడుతోంది. విషయం గుర్తించిన యజమాని కిషన్... ఆ శునకాన్ని నారాయణగూడలోని వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శునకాన్ని పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాటాక్ కడుపులో కణితి పెరుగుతోందని చెప్పారు. అది క్యాన్సర్ సంబంధిత కంతేమోనని వైద్య పరీక్షలు నిర్వహించారు. కాదని తెలిసాక ఆపరేషన్ చేసి కంతిని తొలగించాలని యజమానికి తెలిపారు.
ఏం చేసైనా రాటాక్ను బతికించండి...
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ విద్యానంద గౌడ్, వైద్య సిబ్బంది శునకానికి శస్త్ర చికిత్స చేసి మూడు కిలోల బరువు గల కణితిని తొలగించారు. దాదాపు మూడు గంటల పాటు చేసిస ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఇన్నాళ్లూ తీవ్ర కడుపు నొప్పితో మూలిగిన రాటాక్... ఆపరేషన్ తర్వాత ఆరోగ్యంగా తిరుగుతోందని యజమాని తెలిపారు. తమ శునకానికి ఆపరేషన్ చేసి మరో జన్మను ప్రసాదించిన ఆసుపత్రి సిబ్బందికి కిషన్ సింగ్నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత