2nd Day Praja Palana Applications in Hyderabad : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభయహస్తం(Abhaya Hastham) దరఖాస్తులకు రాజధాని వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఆహ్వానించిన ఐదు గ్యారంటీల్లో నగరవాసులు మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకుంటున్నారు.
బల్దియాలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో ఎక్కడ చూసిన దరఖాస్తుల్లో ఈ మూడు గ్యారంటీలకు సంబంధించిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అభయహస్తం గ్యారంటీ(Congress Guarantees)లకు తోడు రేషన్ కార్డు కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు.
రేషన్ కార్డుకు 48,802 దరఖాస్తులు : దీంతో గ్రేటర్లో మొదటి రోజు కంటే రెండో రోజు భారీగా దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఆరు జోన్లలో కలిపి మొత్తం 3,13,226 దరఖాస్తులు రాగా వాటిలో రేషన్ కార్డు సహా ఇతర అవసరాల కోసం 48802 మంది అర్జీలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్లో 41,639, చార్మినార్‌లో 76,379, ఖైరతాబాద్‌లో 48,856, కూకట్ పల్లిలో 58,723, శేరిలింగంపల్లిలో 27,525, సికింద్రాబాద్ లో 53,589, సికింద్రాబాద్ కంటోన్మెట్‌లో 6,515 దరఖాస్తుల స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రోజు 1,98,009 దరఖాస్తులు : ప్రజాపాలనకు గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు జోన్ల నుంచి అధికారులు 1,98,009 దరఖాస్తును స్వీకరించారు. అందులో అభయహస్తం గ్యారంటీలో 1,73,262 మంది దరఖాస్తులు చేసుకోగా, 20,714 మంది ఇతర అవసరాల కోసం దరఖాస్తులు సమర్పించారు. చార్మినార్ జోన్లో 43,798, ఖైరతాబాద్ జోన్లో 28,068, కూకట్ పల్లి జోన్లో 39,355, ఎల్బీనగర్ జోన్లో 31,513, సికింద్రాబాద్ జోన్లో 31,414, శేరిలింగంపల్లి జోన్లో 19,828, కంటోన్మెంట్ ఏరియాలో 4,033 దరఖాస్తులు అందినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు.
Praja Palana Applications 2023 : ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం దరఖాస్తులు ఎలాంటి కొరత లేదని, దరఖాస్తులు అందరికీ ఉచింతంగా అందజేస్తామని తెలిపారు. ప్రజలెవరూ ఎట్టి పరిస్థితులలో దరఖాస్తులను బయట కొనుగోలు చేయవద్దని కమిషనర్ సూచించారు. ఇలా బయట అమ్మిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలోని ఐదు గ్యారంటీల కోసం ప్రజాపాలన అభయహస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం?
రేపటి నుంచే ఐదు పథకాలకు దరఖాస్తు స్వీకరణ - రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్