IAS Officers Transfers in Telangana : రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటు ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు పోషించిన స్మితా సభర్వాల్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం బదిలీ(IAS Transfers) చేసింది. రాష్ట్ర ఆర్థిక సంస్థ సభ్య కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ జి.చంద్రశేఖర్ రెడ్డిని సీఎం కార్యదర్శిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కుమార్తె, టీఎస్ ఫుడ్స్ ఎండీ ఎస్.సంగీత సత్యనారాయణను ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో జాయింట్ ఐజీగా ఉన్న వేముల శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియమితులయ్యారు.
బీఎండీ ఎక్కాను ఎంసీహెచ్ఆర్డీ అదనపు డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి బదిలీ చేసి గనులు, భూగర్భవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న అహ్మద్ నదీం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జా సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డి.దివ్యను పురపాలక శాఖ డైరెక్టర్‌తో పాటు ప్రజావాణి(Praja Vani) రాష్ట్ర నోడల్ అధికారిగా బాధ్యతలు కేటాయించారు.
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీ - రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
26 IAS Officers Transfer : రంగారెడ్డి కలెక్టర్‌గా ఇటీవల బదిలీ చేసి పోస్టింగు ఇవ్వని భారతీ హోళీకేరిని పురావస్తు శాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. మహబూబాబాద్ కలెక్టర్ కె.శశాంకను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ నుంచి వచ్చిన అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.శరత్‌ను బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. సంగారెడ్డి కలెక్టర్‌గా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నియమితులయ్యారు.
టీఎస్‌పీఎస్సీ(TSPSC) పరీక్ష విభాగం కంట్రోలర్ బి.ఎం.సంతోశ్‌ను గద్వాల కలెక్టర్‌గా నియమించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావుకు జీఏడీ కార్యదర్శిగా అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం.ప్రశాంతికి ఆయుశ్ డైరెక్టర్‌గా, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డి.కృష్ణ భాస్కర్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖల ప్రత్యేక కార్యదర్శిగా, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆర్.వి.కర్ణణ్ టీఎస్ఎంఐడీసీ ఎండీగా, విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎం.హరితను సహకర శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.
రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ చిట్టె లక్ష్మీ : పోస్టింగ్ కోసం వేచి ఉన్న చిట్టె లక్ష్మీని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఉన్న ఎస్. కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫియుల్లాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో పంచాయతీ రాజ్ సంయుక్త కార్యదర్శి అయిషా మస్రత్ ఖానంను నియమించింది. పోస్టింగు కోసం చూస్తున్న అభిలాష అభినవ్‌ను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా నియమించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా ఇటీవల నియమించిన పి.ఖదీరవన్‌ను హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా మార్చింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ జె. శంకరయ్యను రాష్ట్ర సాంకేతిక సర్వీసులు ఎండీగా ప్రభుత్వం నియమించింది.
26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు :
- సాగునీటిశాఖ కార్యదర్శి - రాహుల్ బొజ్జా నియామకం
- ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి - స్మితా సభర్వాల్
- పురావస్తు శాఖ డైరెక్టర్ - భారతి హొళికేరి
- బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి - బుర్రా వెంకటేశం
- గనులశాఖ ముఖ్యకార్యదర్శి - మహేశ్ దత్ ఎక్కా
- ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి - అహ్మద్ నజీద్
- జీఏడీ కార్యదర్శి - ఎం.రఘునందన్‌రావు
- ఆయుష్ డైరెక్టర్ - ఎం.ప్రశాంతి
- రంగారెడ్డి కలెక్టర్ - కె.శశాంక
- నల్గొండ కలెక్టర్ - హరిచందన
- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ - బి.ఎం.సంతోష్
- మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ - అద్వైత్ కుమార్ సింగ్
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ - వల్లూరు క్రాంతి
- పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ - చిట్టెం లక్ష్మి
- పంచాయతీ రాజ్, ఆర్‌డీ కార్యదర్శి - సందీప్ సుల్తానియా
- ఫైనాన్స్, ఫ్లానింగ్ ప్రత్యేక కార్యదర్శి - కృష్ణభాస్కర్
- పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్ - చిట్టెం లక్ష్మి
- కార్మిక శాఖ కార్యదర్శి - కృష్ణ ఆదిత్య
- పీసీబీ సభ్య కార్యదర్శి - బుద్ధ ప్రకాశ్
- మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి - ఎ.ఎం. ఖానమ్
- టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ - ఆర్.వి. కర్ణన్
- సీఎంవో జాయింట్ సెక్రటరీ - సంగీత సత్యనారాయణ
పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ
హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, క్రైమ్స్ జాయింట్ సీపీగా రంగనాథ్