ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె: ఈనెల 13 నుంచి 19 వరకు నిరసన కార్యక్రమాలు​ - TSRTC STRIKE NEWS

ఆర్టీసీ సమ్మెను మరితం ఉద్ధృతం చేసేలా అఖిలపక్షం కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 19 న రాష్ట్ర బంద్​కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. 13 నుంచి 19 వరకు పలు కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారు.

19TH STATE BANDH DECIDED FOR TSRTC STRIKE
author img

By

Published : Oct 12, 2019, 4:19 PM IST

Updated : Oct 12, 2019, 6:42 PM IST

ఈ నెల 19 రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెని ఉద్ధృతం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్‌ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్​ కోదండరామ్ అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భేటీలో కో కన్వీనర్ థామస్​రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు చేపట్టనున్న పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారు. ఈ భేటీకి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నాయకులు వీహెచ్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.

ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ...

  • 13వ తేదీన వంటావార్పు
  • 14న అన్ని డిపోల ముందు బైటాయింపు-బహిరంగ సభలు
  • 15 న రాస్తారోకోలు-మానవహారాలు
  • 16 న జేఏసీకి మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు
  • 17న ధూంధాం కార్యక్రమాలు
  • 18న బైక్ ర్యాలీలు
  • 19న రాష్ట్ర బంద్

ఇదీ చూడండి: సైనైడ్​ 'జాలీ'కి 7 రోజులు పోలీస్​ కస్టడీ

Last Updated : Oct 12, 2019, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.