గత 21 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తామని 2016లో హామీ ఇచ్చారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని మంత్రికి వివరించారు.
ఇదీ చూడండి: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం