హైదరాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని సమీప బస్తీల్లో 13 మంది గర్భిణీలను హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు, జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు వారందరికీ హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. ఫలితంగా బస్తీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
గత నెల 24న 13 మంది గర్భిణీలు 102 వాహనంలో కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లారు. స్టాండింగ్ నిర్వహించిన అనంతరం తిరిగి వారిని బస్తీల్లో వదిలివెళ్లారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్‌కు తరచుగా దగ్గు, వాంతులు రావడం వల్ల అనుమానం వచ్చి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా వాహనంలో ప్రయాణించిన 13 మంది గర్భిణీ మహిళలను హోమ్ క్వారంటైన్ ఉండవలసిందిగా ఆదేశిస్తూ స్టాంపులు వేశారు.
ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు