ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటల్లో కింగ్ కోబ్రా సంచారం రైతులను భయపెడుతోంది. సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా ఎప్పుడేం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
చింతలూరుకు చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబు పొలాల్లో ఎక్కువసార్లు కనిపించిందని చెబుతున్నారు. కింగ్ కోబ్రాను పట్టుకొని అడవుల్లో వదిలిపెట్టాలని... అటవీశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Loan app: ఆన్లైన్ లోన్ కోసం యత్నం.. యువకుడి కొంపముంచింది..!