సికింద్రాబాద్ పార్సిగుట్టలో నివాసం ఉంటున్న ధరావత్ ధర్మ గత కొన్ని రోజులుగా ఇంటింటా తిరుగుతూ తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని... ఎక్కువ ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతను యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూపాయికి కిలో బియ్యం పథకం పెడదారిన పడటమే కాకుండా... ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇవీచూడండి: ఇప్పటివరకు రూ. 6972 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి వేముల