ఈ ఏడాది దేశంలో 96 శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు వైకే రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న బలహీన ఎల్నినో పరిస్థితులు సెప్టెంబర్ వరకు కొనసాగుతాయని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సమానంగా వర్షాలు కురుస్తాయన్నారు. జూన్ మొదటి వారంలో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఎక్కువగా ఆదిలాబాద్లో 98 శాతం, తక్కువగా మహబూబ్‌నగర్, జోగులాంబ జిల్లాలో వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.
ఇవీ చూడండి: ఆఖర్లో హార్దిక్ మెరుపులు.. గెలుపు ముంబయిదే