మండల ప్రణాళిక, సహాయ గణాంక అధికారి.. ఉద్యోగ పరీక్ష తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఉద్యోగాలకు మొత్తం 473 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 481 ఖాళీల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ జారీ చేసి.. రాత పరీక్ష నిర్వహించింది. కోర్టు కేసుల కారణంగా ఆరు ఖాళీలను.. అర్హులు లేక మరో పోస్టును భర్తీ చేయలేదని కమిషన్ పేర్కొంది.
ఇవీ చూడండి: ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు