ETV Bharat / state

కొన్నిచోట్ల ఉద్రిక్తం.. మరికొన్ని చోట్ల వాయిదా..

మండల పరిషత్​ల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మరికాసేపట్లో జరగనుంది.  ముందుగా కో ఆప్షన్​ సభ్యుల ఎన్నిక, అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది. తగినంత సంఖ్య లేకపోవడం, వివాదాలు, రిజర్వేషన్ అభ్యర్థులు లేక పలు ఎంపీపీల ఎన్నిక వాయిదా పడింది.

author img

By

Published : Jun 7, 2019, 11:33 AM IST

Updated : Jun 7, 2019, 3:45 PM IST

కొన్నిచోట్ల ఉద్రిక్తం.. మరికొన్ని చోట్ల వాయిదా..

మండల ప్రజా పరిషత్​లకు మరికొద్దిసేపట్లో పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. కో ఆప్షన్ సభ్యుడితోపాటు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఈరోజు ఆయా మండల ప్రజా పరిషత్​ల ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఉదయం పది గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట ఉపసంహరణ జరిగింది. ప్రస్తుతం చివరి ఘట్టం ఎంపీపీల ఎన్నిక జరగనుంది.

పన్నెండు చోట్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా

ఇవాళ ఉదయమే జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ సీటు ఎస్సీ మహిళకు రిజర్వు కాగా మండలంలో 4 స్థానాల్లో కాంగ్రెస్ సభ్యురాలు వనితకు ఎంపిక అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తనకు కావల్సిన ఇద్దరు సభ్యుల మద్దతు తెరాస ఇవ్వడం లేదు. రిజర్వు అయిన సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరే ఉండటంతో అధికారులు ఈసీకి లేఖ రాశారు.

దాఖలు కాని కో ఆప్షన్ సభ్యుల నామినేషన్లు

మెదక్​ జిల్లా టేక్​మల్​, జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్, జనగామ జిల్లా తరిగొప్పుల, నల్గొండ జిల్లా కేతేపల్లి, నేరేడు గొమ్ము మండలాలు, సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఈ ప్రాంతాల్లో ఉదయం 10గంటల వరకు కో ఆప్షన్ సభ్యుని ఎన్నికకు నామినేషన్ దాఖలు కాలేదు. ఫలితంగా అధికారులు ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

నామినేషన్ వేసి ఉపసంహరణ

జగిత్యాల జిల్లా సారంగాపూర్​లో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కో ఆప్షన్ సభ్యుడు నామినేషన్​ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

హాజరు కాని ఎంపీటీసీ సభ్యులు

నిర్ణీత సమయంలో ఎంపీటీసీ సభ్యులు హాజరు కానందున రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లో ఎన్నికను వాయిదా వేసినట్లు సంబంధిత రిటర్నింగ్​ అధికారులు ప్రకటించారు. ఎంపీపీ ఎన్నికకు సరైన కోరం లేక సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోరంకు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావల్సింది ఉండగా ఒక కాంగ్రెస్ ఎంపీటీసీ గైర్హజరయ్యారు. సరైన సమయంలో కో ఆప్షన్​ సభ్యులు నామినేషన్ దాఖలు చేయని కారణంగా మహబూబ్​నగర్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

మంచిర్యాల జిల్లా భీమిని ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ కాంగ్రెస్, తెరాస చెరి రెండు స్థానాల్లో గెలుపొందగా తెరాసలో మహిళా అభ్యర్థులు లేకపోవడంతో సీటు కాంగ్రెస్​ సభ్యురాలు రాజేశ్వరి, మమతల్లో ఒకరిని వరించనుంది.

చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక

మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు... ఎన్నికైన సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆయా పార్టీలు విప్ జారీ చేయవచ్చు. అయితే విప్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు వర్తిస్తుంది తప్ప.. కోఆప్షన్ సభ్యులకు వర్తించదు. ఎవరైనా పార్టీ విప్ ఉల్లంఘించి ఓటు వేస్తే వారి ఓటు చెల్లుబాటు అవుతుంది కానీ.. సదరు సభ్యుని పదవి మాత్రం పోతుంది.

ఎన్నిక జరగకపోతే..

ఏదైనా కారణాల రీత్యా కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఒకవేళ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక పూర్తై అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడితే మరుసటి రోజు మళ్లీ ఎన్నిక నిర్వహించవచ్చు.

Last Updated : Jun 7, 2019, 3:45 PM IST

For All Latest Updates

TAGGED:

mptcmppts
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.