ETV Bharat / state

సికింద్రాబాద్ బరిలో 'హస్త' సన్యాసమేనా?

సికింద్రాబాద్​ లోక్​సభకు త్రిముఖ పోరు కాస్త ద్విముఖంగా మారేలా ఉంది. కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడినట్లే కనిపిస్తోంది. కారు, కమలం దూసుకుపోతుంటే హస్తం డీలా పడిపోయింది. ప్రచార తారల జాడే కనిపించడం లేదు. ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నారు. వీధుల్లో రథాలను తిప్పుతూ మమ అనిపిస్తున్నారు.

సికింద్రాబాద్​లో కాంగ్రెస్ డీలా
author img

By

Published : Apr 8, 2019, 9:19 PM IST

మొదట్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పోరు...మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనబడింది. అధికార పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్, భాజపా నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ నెలకొన్న త్రిముఖ పోరులో గెలిచేదెవరో అన్నంత ఉత్కంఠ ఉండేది. కానీ పోలింగ్ దగ్గర పడుతుండగా... రోజురోజుకు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. తెరాస, భాజపా ప్రచారంలో దూసుకుపోతుంటే... కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.

సికింద్రాబాద్​లో కాంగ్రెస్ డీలా

తనయుని గెలుపు కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ప్రతిరోజు రోడ్​షోలు చేస్తూ... శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. కిషన్ రెడ్డికి మద్దతుగా జాతీయ నాయకులు, ప్రచార తారలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా... పోటీ తెరాస, భాజపా మధ్యే అన్నట్టు కనిపిస్తోంది.

సికింద్రాబాద్​లో కాంగ్రెస్ ప్రచారం మందగించిందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ముఖ్య నేతలెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అభ్యర్థి అంజన్​ కుమార్​ యాదవ్​ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తోంది. లోక్​సభ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం... కాంగ్రెస్ చేతులెత్తేయడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇవీ చూడండి: ఎన్నికల్లో డబ్బు, మద్యమే కాదు...మిక్సీలు కూడా!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.