తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురులేదని... మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రేపు జరగనున్న పరిషత్ ఎన్నికల లెక్కింపు తర్వాత జిల్లా, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక వరకు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.
ఇవీ చూడండి: ఆ నలుగురు మినహా అంతా గులాబీమయం..!