జీహెచ్ఎంసీ బడ్జెట్హైదరాబాద్ నగర పాలక మండలి భారీ బడ్జెట్‌కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. 2019 - 2020 ఆర్థిక సంవత్సరానికి మేయర్ బొంతు రామ్మోహన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 11 వేల 538 కోట్లతో స్టాండింగ్ కమిటీ అనుమతించిన పద్దును కార్పొరేటర్లు అమోదించారు. బడ్జెట్‌ను రెండు విభాగాలుగా రూపొందించారు. బల్దియా నేరుగా చేసే ఖర్చు 6వేల 150కోట్లుగా అంచనా వేశారు. వివిధ కార్పొరేషన్ల నుంచి బల్దియా ఖర్చు చేయడానికి 5వేల 388కోట్లు వ్యయం అవుతుందని లెక్కకట్టారు. గతేడాది బడ్జెట్ 13వేల 150 కోట్లుండగా .. ఈ ఏడాది అది 1వేయి 612 కోట్లు తగ్గింది. రెవెన్యూ ద్వారా 3వేల 210కోట్ల ఆదాయం వస్తుందని భావించారు. 2వేల 808కోట్ల నిధులు ఖర్చు అయినా మిగులు 402 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక క్యాపిటల్ రాబడిలో.. అప్పులపైనే బల్దియా నమ్మకం పెట్టుకుంది. 2 వేల 367కోట్లను అప్పుల రూపంలో సమీకరించేందుకు సిద్ధమయింది. క్యాపిటల్ పెట్టుబడిలో 5వేల 188కోట్లను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చెయ్యడానికి ఓకే చెప్పింది. రోడ్ల అభివృద్ధికి 1850 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం 8వేల 730కోట్లు ఖర్చు చెయ్యడానికి సిద్ధమయ్యింది హైదరాబాద్ పాలక మండలి. బడ్జెట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు ఎంతని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీ జాఫ్రి ప్రశ్నించారు. కొన్ని సార్లు వేతనాలు చెల్లించడానికి కూడా జీహెచ్ఎంసీ ఇబ్బందులు పడుతుందన్నారు. మూసీ, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులు వచ్చాయా అని అడిగారు. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులపై చర్యలు తీసుకోవాలని సూచించారు జాఫ్రి. గ్రేటర్ బడ్జెట్‌ను ఆమోదించిన కార్పొరేటర్లు తమకు ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేస్తున్నా.. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావట్లేదు. వచ్చినా వాటిని విడుదల చేయడం లేదు. ఆ బడ్జెట్ విడుదలయ్యే నాటికి 50శాతం కూడా పూర్తి కావడం లేదని కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు.
బల్దియా బడ్జెట్ రూ.11వేల 538 కోట్లు - corporaors
హైదరాబాద్ మేయర్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. స్టాండింగ్ కమిటీ అనుమతించిన పద్దును ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి మార్పులు చేయకుండా కార్పొరేటర్లు ఆమోదించారు.