ETV Bharat / state

ప్రపంచంలోనే మన విమానాశ్రయం ర్యాంకు 8 - rajiv gandhi international airport

ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి 10 స్థానాల్లో చోటు సంపాదించింది. 2019 సంవత్సరానికి ఎయిర్‌హెల్ప్‌ అనే సంస్థ ఈ ర్యాంకులను విడుదల చేసింది.

ప్రపంచంలోనే మన విమానాశ్రయం ర్యాంకు 8
author img

By

Published : May 10, 2019, 2:41 PM IST

ఎయిర్ హెల్ప్ సంస్థ విడదల చేసిన జాబితాలో అత్యుత్తమ విమానాశ్రయాలలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ఎయిర్ పోర్టు నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ వంటి అంశాల ఆధారంగా 40దేశాల్లో 40వేల మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించారు. మొదటి స్థానంలో ఖతార్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, జపాన్​లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్​లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2015 నుంచి ఈ ర్యాంకులు విడుదల చేస్తుండగా ఇవే మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. అమెరికా, యూకే నుంచి ఒక్కటీ టాప్​ 10లో చోటు దక్కకపోవడం గమనార్హం. అత్యుత్తమ ఎయిర్​లైన్ల ర్యాకింగ్స్​లో ఖతార్ ఎయిర్​లైన్స్​ మొదటి స్థానం, అమెరికన్ ఎయిర్​లైన్స్ 2, ఏరో మెక్సికో 3 స్థానం సంపాదించాయి.

ప్రపంచంలోనే మన విమానాశ్రయం ర్యాంకు 8

టాప్‌ 10 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..

1. హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఖతార్‌
2. టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్‌
3. ఏథెన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్‌
4. అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్‌
5. గాన్స్‌ లెచ్‌ వలేసా ఎయిర్‌పోర్టు, పోలాండ్‌
6. షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం, రష్యా
7. షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్‌, సింగపూర్‌
8. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్‌
9. టెనెరిఫె నార్త్‌ ఎయిర్‌పోర్టు, స్పెయిన్‌
10. విరాకోపస్‌/కాంపినస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రెజిల్‌

ఇవీ చూడండి: రామేశ్వరుడి సన్నిధిలో చంద్రశేఖరుడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.