ఇల్లందు పట్టణంలో పూర్వ విద్యార్థుల సేవలను పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అభినందించారు. ఇల్లందు పట్టణంలో 1994 - 95 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు నిర్వహించిన సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగదు పంపిణీ
పూర్వ విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో డయాబెటిస్, బీపీ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు మందుల పంపిణీ చేశారు. కొవిడ్ కారణంగా ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులకు నగదు సహాయం చేశారు.
ప్రసంశనీయం
పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు దాదాపు 70 వేల విలువైన వస్తువులను, నగదును అందజేయడం ప్రసంశనీయమన్నారు. ఇప్పటికే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పూర్వ విద్యార్థులు పచ్చని మొక్కలతో వనంలా తీర్చిదిద్దడాన్ని ఆయన అభినందించారు.