Bhadradri Temple News : భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఇవాళ శ్రీరామచంద్రుడు బలరామ అవతారంలో దర్శనమిస్తున్నారు. నిత్య కల్యాణ మండపంలో స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. బలరామయ్యను దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలించారు.
ఆ ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదు..
Bhadradri Vaikunta Ekadasi Adhyayanotsavam: కరోనా దృష్ట్యా ఈనెల 12న జరగనున్న తెప్పోత్సవం, 13న జరగనున్న ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. కేవలం అర్చకులు, వేదపండితులు సమక్షంలోనే ఆ రెండు రోజులు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
కరోనా నిబంధనలకు కట్టుబడే దర్శనం..
Vaikunta Ekadasi Adhyayanotsavam in Bhadradri : అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాస్కు ధరించని వారిని ఆలయంలోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.