భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో.. ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం పంచాంగ శ్రవణ పారాయణం చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు.. స్వామివారి ఎదుట పంచాంగానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం.. ఆలయ పురోహితులు వెంకటేశ్వర అవధాని... సీతా రాములవారి ఆదాయ వ్యయాలను భక్తులకు వినిపించారు.
రామయ్యది కర్కాటక రాశి అని.. వారి ఆదాయం 14 , ఖర్చు 2, మిగులు 12, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని వెంకటేశ్వర అవధాని వివరించారు. అలాగే సీతమ్మది కన్యా రాశి అంటూ.. వారి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందని తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో.. ఆలయం అభివృద్ధి దిశగా వెళ్లేందుకు అనుకూలంగా ఉందని వివరించారు.
ఇదీ చదవండి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు