భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉదయం నుంచే నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల బస్సులు అడ్డుకోవటం వల్ల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: సంచులకొద్ది బయటపడుతున్న యూరియా అమ్మకాల అక్రమాలు..