భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు అరగంటకుపైగా మానవహారం నిర్వహించగా ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆగ్రహించారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయని కార్మికులను పోలీసులు చెదరగొట్టారు.
కార్మిక యూనియన్ నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన వారిని చెదరగొట్టగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన డ్రైవర్ అక్కులు సృహతప్పగా మంచి నీళ్ళు తాగించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల భద్రత, ఉద్రిక్తతల నడుమ కార్మికులు ర్యాలీ కొనసాగించారు.
ఇదీ చూడండి : ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న