భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని గోదావరి నది ప్రాంతం మొత్తం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు నది వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
అనంతరం గోదావరి నదిలో కార్తిక దీపాలను వదులుతున్నారు. నది ఒడ్డున ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలను వెలిగిస్తూ వారి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కార్తీక పౌర్ణమి మొదలు కావడం వల్ల భద్రాచలంలో భద్రాద్రి గోదావరి మహా హారతి సమితి ఆధ్వర్యంలో.. సాయంత్రం 6 గంటలకు గోదారమ్మకు నదీ హారతులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని సమితి అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: 1000 స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు