మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివచ్చి.. పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో దేవాలయాలు కళకళలాడుతున్నాయి.