ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో భాజపా నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయంలోని హోమశాలలో ప్రధాని మోదీ పేరుతో ధన్వంతరి హోమం నిర్వహించారు.
తర్వాత ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ మళ్లీ భారతదేశ ప్రధానిగా ఉండాలని రామయ్యను వేడుకున్నట్లు భాజపా నాయకులు ఎర్రంరాజు తెలిపారు.
ఇదీ చూడండి : భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు