లాక్డౌన్ నేపథ్యంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు విశేష సేవలందిస్తున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల సరిహద్దులలో నిఘా తీవ్రతరం చేసి ఇతర జిల్లాల నుంచి లోపలికి ఎవరినీ అనుమతించట్లేదు. మార్చి 12వ తేదీన జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కాగానే… పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టగా... మార్చి 24 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు..
జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్ దత్‌లు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వాల సూచనల మేరకు అధికారుల కృషితో జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలవుతోంది. మరోవైపు ప్రజా ప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు