భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మణ సమేత సీతారాములకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. బుధవారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తులను ప్రాకార మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
పాలు, తేనె, నెయ్యి, నదీ జలాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య స్వామివార్లకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల స్వామివారి కల్యాణం భక్తులు లేకుండా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.