ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన సింగరేణి జీఎం - Latest news in Telangana

ఇల్లందు కొవిడ్​-19 క్వారంటైన్ కేంద్రాన్ని సింగరేణి జీఎం సత్యనారాయణ సందర్శించారు. సింగరేణి గనులు, వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు.

Singareni GM Satya Narayana
Singareni GM Satya Narayana
author img

By

Published : Apr 24, 2021, 1:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెకండ్​ వేవ్​ కొవిడ్​-19 క్వారంటైన్ కేంద్రాన్ని సింగరేణి జీఎం సత్యనారాయణ సందర్శించారు. సెకండ్​ వేవ్​ కొవిడ్​-19 వేగంగా విస్తరిస్తుందని ఉద్యోగులు ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని.. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా… వెంటనే టెస్టు చేయించుకోవాలని సూచించారు. సింగరేణి గనులు, వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. కార్యాలయంలో పనుల స్థలంలో అందుబాటులో శానిటైజర్లు ఉంచాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ… వ్యాక్సిన్​ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.