సింగరేణి ప్రాంతాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల క్యాంప్ కార్యాలయాన్ని ఏరియా జీఎం సత్యనారాయణ తనిఖీ చేశారు. కార్మికుల హాజరు నమోదు కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌ను ఆయన పరిశీలించారు.
క్యాంటీన్లోని భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికులందరూ భౌతిక దూరం పాటించాలని.. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు మాస్కులను ధరించి విధులకు హాజరుకావాలని తెలిపారు. సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: హోం ఐసోలేషన్‌కు కాలనీవాసుల అభ్యంతరం