ETV Bharat / state

Rush at bhadradri temple : భద్రాద్రి రాముడి కోవెలకు కార్తిక శోభ

కార్తికమాసం సహా సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు భద్రాద్రి రాములోరి దర్శనానికి తరలివచ్చారు(Rush at bhadradri temple). భక్తుల రద్దీతో ఆలయ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతా రాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారుపుష్పాలతో అర్చన చేశారు.

Rush at bhadradri temple
Rush at bhadradri temple
author img

By

Published : Nov 14, 2021, 3:16 PM IST

భద్రాద్రి రాముని కోవెల(Bhadradri Rama temple) కార్తిక శోభను(Kartika masam) సంతరించుకుంది. తెల్లవారుజామునే పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు.. కార్తిక దీపాలు(Kartika deepam) వెలిగించి రామయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. ఓవైపు కార్తిక మాసం.. మరోవైపు ఆదివారం కావడం వల్ల ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తిక మాసం ప్రత్యేకతను.. రామయ్యకు కార్తిక మాసానికి ఉన్న సంబంధాన్ని అర్చకులు భక్తులకు వివరించారు.

కరోనా మూడో దశ(corona third wave) ముప్పు పొంచి ఉండటం వల్ల ఆలయంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన(corona rules violation) జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చేటప్పుడు ద్వారం వద్ద భక్తులకు శానిటైజర్(sanitizer) అందజేశారు. మాస్కు లేకుండా లోనికి సిబ్బంది భక్తులను లోనికి అనుమతించలేదు. థర్డ్ వేవ్(corona third wave) మొదలవుతున్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.