ETV Bharat / state

సర్కారు దవాఖానాలో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్ల కుంభకోణం... వైద్యుడి అరెస్ట్‌ - తెలంగాణలో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్ల కుంభకోణం

పేదల ప్రాణాలు నిలపాల్సిన సర్కారు దవాఖానాల్లో పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ను ప్రైవేటులో అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు తీగ లాగితే అక్రమాల డొంక కదలింది.

telangana news
bhadradri kothagudem hospital
author img

By

Published : May 4, 2021, 12:00 PM IST

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బయటకు తరలించిన ఘటనలో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్య నిపుణుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సహా ఇద్దరిపై సోమవారం కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ స్వామి కథనం ప్రకారం.. గత నెల 29న తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలానికి చెందిన కొవిడ్‌ బాధితుడు చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డా.కృష్ణప్రసాద్‌ను సంప్రదించాడు. ఆ రోగిని వైద్యుడు తన కుటుంబ సభ్యులు నిర్వహించే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి సిఫారసు చేశాడు. అక్కడ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు నిర్వాహకులు అధిక ధర చెప్పడంతో అదేరోజు సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణప్రసాద్‌ తమ ప్రైవేటు దవాఖానాకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు అక్రమంగా తరలించినట్లు నిర్థారించారు. అదనపు ఎస్పీ డా.వినీత్‌, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలు నాలుగు రోజుల పాటు పలు కోణాల్లో దర్యాప్తు జరిపాయి. సుమారు 200 ఇంజక్షన్లు ప్రైవేటు ఆసుపత్రికి మళ్లించినట్లు గుర్తించారు. సోమవారం డా.కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.యుగంధర్‌, ఫార్మసిస్ట్‌ టి.శ్రీనివాస్‌ అలియాస్‌ బన్నిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

విజిలెన్స్‌ కన్ను

రెమ్‌డెసివిర్‌ను బహిరంగ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించేందుకు విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వమే ఈ మందును సరఫరా చేస్తోంది. బహిరంగ మార్కెట్లో రెమ్‌డెసివిర్‌ దొరకడంలేదు. ఈ ఔషధానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందే పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రభుత్వాసుపత్రులకు ఈ మందు పంపడంతో ఎక్కడైనా భద్రాచలంలోలా దారి మళ్లిందా అనే విషయాన్ని ఆరా తీసేందుకు విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. ఆసలు ఏ ఆసుపత్రికి ఎంత కేటాయించారు, వాటిని ఎవరెవరికి ఇచ్చారు, ఇంకా ఎంత మిగిలి ఉందన్న వివరాలు ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 6,876 కరోనా కేసులు, 59 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.